జన్యుమార్పిడి పంది మాంసానికి అమెరికా అనుమతి

ABN , First Publish Date - 2020-12-17T07:52:10+05:30 IST

ఆహారం, వైద్య ఉత్పత్తుల కోసం జన్యుపరంగా మార్చిన వరాహాన్ని అమెరికా నియంత్రణ సంస్థలు ఆమోదించాయి. యునైటెడ్‌ థెరప్యూటిక్స్‌ కార్పొరేషన్‌ (

జన్యుమార్పిడి పంది మాంసానికి అమెరికా అనుమతి

న్యూయార్క్‌, డిసెంబరు 16: ఆహారం, వైద్య ఉత్పత్తుల కోసం జన్యుపరంగా మార్చిన వరాహాన్ని అమెరికా నియంత్రణ సంస్థలు ఆమోదించాయి. యునైటెడ్‌ థెరప్యూటిక్స్‌ కార్పొరేషన్‌ (యూటీసీ) అనే కంపెనీ ఈ పందిలో జన్యుపరంగా మార్పులు చేసింది. అయితే మాంసం కోసం అటువంటి పందిని విక్రయించే ఆలోచన ఇప్పట్లో లేదని యూటీసీ పేర్కొంది. దీంతో మనుషులు వినియోగించేందుకు ఆమోదం పొందిన రెండో జంతువుగా ఈ వరాహం గుర్తింపు పొందింది. ఈ వరాహానికి ‘గాల్‌సేఫ్‌’ అని పేరుపెట్టారు.


చాలా క్షీరదాల్లో ఉండే ఆల్ఫాగాల్‌ అనే చక్కెరను తీసేసి ఈ వరాహంలో జన్యుపరంగా మార్పులు చేశారు. బ్లడ్‌ థిన్నర్‌ వంటి ఉత్పత్తులను (రక్తం గడ్డ కట్టకుండా నివారించే ఔషధాలు) అభివృద్ధి చేయడానికే గాల్‌సేఫ్‌ వరాహంలో జన్యుపరమైన మార్పులు చేయడానికి కారణమని యూటీసీ తెలిపింది. 


Updated Date - 2020-12-17T07:52:10+05:30 IST