అమెరికా కరోనా పరిశోధనపై చైనా హ్యకర్ల కన్ను!

ABN , First Publish Date - 2020-05-12T04:04:32+05:30 IST

వ్యాక్సిన్ తయారు చేసేందుకై అమెరికాలో కరోనా మహమ్మారిపై జరుగుతున్న పరిశోధనలపై చైనా హ్యాకర్లు కన్నేశారా? వాటిని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నది అమెరికా నేర పరిశోధన సంస్థ ఎఫ్‌బీఐ.

అమెరికా కరోనా పరిశోధనపై చైనా హ్యకర్ల కన్ను!

వాషింగ్టన్: వ్యాక్సిన్ తయారు చేసేందుకై అమెరికాలో కరోనా మహమ్మారిపై జరుగుతున్న పరిశోధనలపై చైనా హ్యాకర్లు కన్నేశారా? వాటిని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నది అమెరికా నేర పరిశోధన సంస్థ ఎఫ్‌బీఐ. సైబర్ భద్రతా నిపుణులకు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయలో  ప్రభుత్వాన్ని ప్రైవేటు సంస్థలను హెచ్చరిస్తూ ఎఫ్‌బీఐ త్వరలో ఓ ప్రకటన విడుదల చేయబోతోందని అమెరికా జాతీయ మీడియాలో వార్తలు ప్రచురితమయ్యాయి. హ్యాకర్ల వెనుక చైనా ప్రభుత్వం కూడా ఉన్నట్టు సైబర్ నిపుణులు భావిస్తున్నారు. అయితే చైనా మాత్రం ఈ ఆరోపణలు ఖండించింది. ఎటువంటి సైబర్ దాడులను చైనా సమర్థించదని వ్యాఖ్యానించింది. కరోనాపై  పరిశోధన, చికిత్స వంటి వాటికి సంబంధించి చైనా ఎంతో పురోగతి సాధిస్తోంది. ఇలాంటి సమయంలో చైనా పరువు మంటకలిసేలా వదంతులు వ్యాప్తి చేయడం అనైతికం అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావ్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-12T04:04:32+05:30 IST