లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా!

ABN , First Publish Date - 2020-05-25T01:04:28+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా!

లక్నో: కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్-19 రెండో సవరణ మార్గదర్శకాల ప్రకారం జరిమానా నిబంధనలను సవరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించకున్నా, ముఖాలను కప్పుకోకున్నా, బహిరంగంగా ఉమ్మినా ఐపీసీ సెక్షన్ 15(3) ప్రకారం రూ.500 జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది. అలాగే, లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారికి సెక్షన్ 15(4) ప్రకారం రూ. 100 నుంచి రూ. 1000 వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. ద్విచక్ర వాహనాలపై ఇద్దరు కనుక ప్రయాణిస్తే సెక్షన్ 15(5) ప్రకారం రూ. 250 నుంచి రూ. 1,000 వరకు జరిమానా విధించడంతోపాటు లైసెన్స్‌ను రద్దు చేయనున్నట్టు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 

Updated Date - 2020-05-25T01:04:28+05:30 IST