యూపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజులో..
ABN , First Publish Date - 2020-07-08T16:48:41+05:30 IST
ఉత్తర ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరింత విస్తృతంగా వ్యాపిస్తోంది. మంగళవారం రాత్రి వరకు..

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరింత విస్తృతంగా వ్యాపిస్తోంది. మంగళవారం రాత్రి వరకు 24 గంటల్లో ఇక్కడ 1,346 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని పాజిటివ్ కేసులు రావడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. లక్నోలో అత్యధికంగా 196 కేసులు రాగా... ఘజియాబాద్‌లో 149, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా 115 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29968కి పెరిగింది. గత 24 గంటల్లో 518 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారనీ.. దీంతో ఇప్పటి వరకు యూపీలో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 19,627కి పెరిగిందని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ మహమ్మారి కారణంగా మరో 18 మంది మృతి చెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 827కు పెరిగింది. ప్రస్తుతం 9,514 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలను కోరారు.