హాథ్రస్ కుటుంబీకులతో పోలీస్ ఉన్నతాధికారుల భేటీ

ABN , First Publish Date - 2020-10-03T22:16:17+05:30 IST

హాథ్రస్ బాధిత కుటుంబీకులతో హోంశాఖ సహాయ కార్యదర్శి, డీజీపీ శనివారం భేటీ అయ్యారు

హాథ్రస్ కుటుంబీకులతో పోలీస్ ఉన్నతాధికారుల భేటీ

లక్నో : హాథ్రస్ బాధిత కుటుంబీకులతో హోంశాఖ సహాయ కార్యదర్శి, డీజీపీ శనివారం భేటీ అయ్యారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వీరు కుటుంబీకులకు హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై పోలీసుల తరపున విచారణ పూర్తైంది. ఆ రిపోర్టును పోలీసు ఉన్నతాధికారులు శనివారం సీఎం యోగికి సమర్పించారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.




‘‘ఈ ఘటన చాలా దారుఫమైంది. సీఎం యోగి సూచనలతోనే తాము బాధిత కుటుంబీకులను కలుసుకున్నాం. వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నాం. నివేదిక అందింది కాబట్టి... బాధ్యులైన వారిని సస్పెండ్ చేశాం’’ అని హోంశాఖ సహాయ కార్యదర్శి అవినాశ్ అవస్థీ తెలిపారు. ‘సిట్’ దర్యాప్తు కొనసాగుతోందని, కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశామని అవినాశ్ అవస్థీ ప్రకటించారు. 

Updated Date - 2020-10-03T22:16:17+05:30 IST