ఎమ్మెల్యే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. గాయకురాలి ఆరోపణ

ABN , First Publish Date - 2020-10-19T19:51:19+05:30 IST

ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే విజయ్ మిశ్రా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ వారణాసికి చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేతో పాటూ ఆయన కుమారుడు, మరో బంధువు తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించింది. 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇది జరిగినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే విజయ్ మిశ్రా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ వారణాసికి చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఎమ్మెల్యే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. గాయకురాలి ఆరోపణ

లక్నో: ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే విజయ్ మిశ్రా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ వారణాసికి చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేతో పాటూ ఆయన కుమారుడు, మరో బంధువు తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించింది. 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇది జరిగినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.


బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2014 ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే పిలుపు మేరకు ఎన్నికల ప్రచారంలో పాటలు పాడేందుకు ఆమె వెళ్లింది. ఆ సమయంలో బాధితురాలిని చెరిచేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించాడు. అతడి ప్రయత్నాలను ఆమె అడ్డుకోగా..గన్నుతో బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ తరువాత ఎమ్మెల్యే కుమారుడితో పాటూ..అతడి బంధువు కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.


 అయితే.. ఎమ్మెల్యే ఏ ప్రమాదం తలపెడతాడోనని భయపడిన బాధితురాలు ముంబైకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడని తెలుసుకుని అతడిపై ఫిర్యాదు చేసేందుకు మళ్లీ ఉత్తరప్రదేశ్‌కు వచ్చింది. కాగా.. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిశ్రా 2017లో జ్ఞాన్‌పూర్-బడోహీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే..అక్రమంగా ఓ ప్రాపర్టీని కబ్జా చేశారనే ఆరోపణపై మిశ్రాను పోలీసులు ఆగస్టు నెలలో అరెస్టు చేశారు. 

Updated Date - 2020-10-19T19:51:19+05:30 IST