యూపీలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు..మంత్రి స్పష్టం

ABN , First Publish Date - 2020-11-26T02:56:13+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలో ఉందని, మళ్లీ లాక్ డౌన్ ఉండదని, సరిహద్దుల సీలు ఉండదని....

యూపీలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు..మంత్రి స్పష్టం

 లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలో ఉందని, మళ్లీ లాక్ డౌన్ ఉండదని, సరిహద్దుల సీలు ఉండదని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి జయప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు. యూపీలో 5,33,355 మందికి కరోనా సోకగా 29 మంది మరణించారని మంత్రి చెప్పారు. కరోనా కట్టడి కోసం యూపీ ఆరోగ్యశాఖ వాలంటీర్లతో కలిసి పనిచేసిందని మంత్రి చెప్పారు. నోయిడా వద్ద ఢిల్లీ సరిహద్దును మూసివేయమని మంత్రి స్పష్టం చేశారు. లక్నోలో 325 కరోనా కేసులు, మీరట్ లో 242, గౌతమ్ బుద్ధనగర్లో 223, ఘజియాబాద్ లో 179 కరోనా కేసులు నమోదైనాయని మంత్రి చెప్పారు. యూపీలో కరోనా ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి జయప్రతాప్ సింగ్ వివరించారు.

Updated Date - 2020-11-26T02:56:13+05:30 IST