యోగి స‌ర్కార్‌లోని మరో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

ABN , First Publish Date - 2020-08-18T17:25:44+05:30 IST

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మరో మంత్రికి కరోనా సోకింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ‌ మంత్రి అతుల్ గర్గ్ క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు. కాగా యోగి ప్రభుత్వానికి చెందిన ప‌లువురు మంత్రులు...

యోగి స‌ర్కార్‌లోని మరో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మరో మంత్రికి కరోనా సోకింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ‌ మంత్రి అతుల్ గర్గ్ క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు. కాగా యోగి ప్రభుత్వానికి చెందిన ప‌లువురు మంత్రులు కరోనా బారిన ప‌డ్డారు. వారిలో ఇద్దరు మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్ మృతిచెందారు. దీనికి ముందు యోగి ప్రభుత్వానికి చెందిన మొత్తం ఎనిమిది మంది మంత్రుల‌కు కరోనాకు సోకింది. ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ అలియాస్ మోతీ సింగ్, న్యాయ‌శాఖ‌ మంత్రి బ్రజేష్ పాఠ‌క్, జల విద్యుత్‌శాఖ‌ మంత్రి మహేంద్ర సింగ్, ఆయుష్ రాష్ట్ర మంత్రి ధరం సింగ్ సైపీ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉపేంద్ర తివారీల‌కు క‌రోనా సోకింది. 

Updated Date - 2020-08-18T17:25:44+05:30 IST