పోలీసులు: భార్యకు ప్రాణదాతలు.. భర్తకు దేవుళ్ళు

ABN , First Publish Date - 2020-04-21T15:41:37+05:30 IST

యూపీలోని నోయిడాలో అత్యవసర పిలుపునకు స్పందించిన ఇద్దరు పోలీసులు తమ రక్తాన్ని దానం చేశారు. ఈ రక్తం ఒక గర్భిణికి...

పోలీసులు: భార్యకు ప్రాణదాతలు.. భర్తకు దేవుళ్ళు

నోయిడా: యూపీలోని నోయిడాలో అత్యవసర పిలుపునకు స్పందించిన ఇద్దరు పోలీసులు తమ రక్తాన్ని దానం చేశారు. ఈ రక్తం ఒక  గర్భిణికి ప్రసవ సమయంలో సహాయపడింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల అత్యవసర సేవలకు ఒక కాల్ వచ్చింది. విజయ్ కుమార్ అనే వ్యక్తి  తన భార్యను డెలివరీ కోసం సెక్టార్ 24 లోని ఇఎస్‌ఐ ఆసుపత్రిలో చేర్పించినట్లు ఫోనులో తెలిపారు. తన భార్య రజనీకి రెండు యూనిట్ల రక్తం అవసరమని చెప్పాడు.  రక్తం అందుబాటులో లేదని, సహాయం చేయాలని కోరాడు. వెంటనే పోలీసు వాహనం ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ కమాండర్ అంజుల్ కుమార్ త్యాగి, పైలట్ లాలా రామ్ ఒక్కో యూనిట్ చొప్పున రక్తాన్ని దానం చేశారు. ఆ మహిళకు డెలివరీ విజయవంతంగా జరిగింది. ఇప్పుడు తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తమకు సహాయం అందించిన పోలీసులు  దేవుళ్లవంటివారని అన్నారు. 


Updated Date - 2020-04-21T15:41:37+05:30 IST