యూపీ పీసీసీ అధ్యక్షుడు ‘హౌజ్ అరెస్ట్’

ABN , First Publish Date - 2020-10-03T17:09:12+05:30 IST

యూపీ పీసీసీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లును పోలీసులు శనివారం గృహ నిర్బంధంలో ఉంచారు. హత్రా

యూపీ పీసీసీ అధ్యక్షుడు ‘హౌజ్ అరెస్ట్’

లక్నో : యూపీ పీసీసీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లును పోలీసులు శనివారం గృహ నిర్బంధంలో ఉంచారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని రాహుల్, ప్రియాంక నిర్ణయించుకున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘పీసీసీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లును పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ ప్రభుత్వం ఎంత భయపడుతుందో? ఆపడానికి మేము వెళ్లడం లేదు.’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.


అయితే ఈ ఘటనపై అజయ్ లల్లు స్పందిస్తూ.. తనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారని, ఏదో దాచాలనే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎవర్నో రక్షించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, యూపీలో మహిళలకు రక్షణ లేదని లల్లూ మండిపడ్డారు. 

Updated Date - 2020-10-03T17:09:12+05:30 IST