మహిళా ఫిర్యాదుదారుల కోసం పోలీస్ స్టేషన్లలో గ్లాస్ రూమ్స్: సీఎం

ABN , First Publish Date - 2020-10-25T02:34:34+05:30 IST

మహిళా ఫిర్యాదుదారుల కోసం పోలీస్ స్టేషన్లలో గ్లాస్ రూమ్స్: సీఎం

మహిళా ఫిర్యాదుదారుల కోసం పోలీస్ స్టేషన్లలో గ్లాస్ రూమ్స్: సీఎం

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో గ్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. మహిళా ఫిర్యాదుదారులు పోలీసు స్టేషన్‌కు వచ్చి తమ ఫిర్యాదులను మహిళా పోలీసు సిబ్బందికి చెప్పుకునేందుకు వీలుగా గ్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసు అధికారులను ఆదేశించారు.


యూపీలో పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేయబోయే "రహస్య" గాజు గది మహిళా ఫిర్యాదుదారులు మహిళా పోలీసు సిబ్బందితో ఏమాత్రం సంకోచించకుండా మాట్లాడటానికి సహాయపడుతుందని సీఎం వెల్లడించారు. మిషన్ శక్తి కార్యక్రమం ద్వారా మహిళల భద్రతను మెరుగుపరచడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1,535 పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన మహిళా హెల్ప్ డెస్క్‌లను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు.

Updated Date - 2020-10-25T02:34:34+05:30 IST