సీఏఏ, ఎన్నార్సీ నిరసనకారుల ఆచూకీ చెబితే నగదు బహుమతి

ABN , First Publish Date - 2020-11-06T16:07:28+05:30 IST

పరారీలో ఉన్న సీఏఏ, ఎన్నార్సీ నిరసనకారుల ఆచూకీ చెబితే నగదు బహుమతి ఇస్తామని...

సీఏఏ, ఎన్నార్సీ నిరసనకారుల ఆచూకీ చెబితే నగదు బహుమతి

యూపీ సర్కారు ప్రకటన

లక్నో (ఉత్తరప్రదేశ్): పరారీలో ఉన్న సీఏఏ, ఎన్నార్సీ నిరసనకారుల ఆచూకీ చెబితే నగదు బహుమతి ఇస్తామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యూపీలో గతంలో జరిగిన సీఏఏ, ఎన్నార్సీ నిరసనలు హింసాత్మకంగా మారి కాల్పులకు దారితీసింది. మతతత్వ అసమ్మతిని వ్యాప్తి చేయడంతో పాటు ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారని నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.14 మంది నిరసనకారుల్లో 8 మందిపై గ్యాంగ్ స్టర్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిరసనకారుల ఇళ్లకు పోలీసులు నోటీసులు అతికించారు.


నిందితుల్లో షియా మతాధికారి మౌలానా సైఫ్ అబ్బాస్ కూడా ఉన్నారు. పాత నగరంలోని ఇమాంబారా ప్రాంతంలో చాలా  చోట్ల నిరసన కారుల చిత్రాల పోస్టర్లు అతికించారు.గత ఏడాది డిసెంబరులో లక్నోలో జరిగిన నిరసనలత్లో 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ,పార్సీ విశ్వాసాల ప్రజలను పౌరసత్వానికి అర్హులుగా మార్చడానికి కొత్త పౌరసత్వ చట్టం 1955 ను కేంద్రం సవరించింది.

Updated Date - 2020-11-06T16:07:28+05:30 IST