ఆగ్రాలో కరోనా చావుల మధ్య 154 కేరింతలు

ABN , First Publish Date - 2020-04-26T16:01:16+05:30 IST

యూపీలోని ఆగ్రాలో 132 ఏళ్ళ పురాతన లేడీ లాయల్ హాస్పిటల్ అరుదైన రికార్డును దక్కించుకుంది శనివారం తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు వైద్యులు, వారి సహచర బృందం....

ఆగ్రాలో కరోనా చావుల మధ్య 154 కేరింతలు

ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో 132 ఏళ్ళ పురాతన లేడీ లాయల్ హాస్పిటల్ అరుదైన రికార్డును దక్కించుకుంది  శనివారం తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు వైద్యులు, వారి సహచర బృందం ఒకే రోజులో 86 సిజేరియన్లు, 68 సాధారణ ప్రసవాలను నిర్వహించారు. ఇందుకోసం 150 మందికి పైగా ప్రసూతి వైద్యులు లేడీ లాయల్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. ఉదయం ఆరు గంటలకు సాధారణ డెలివరీ ప్రక్రియ ప్రారంభమైంది. సమయం గడుస్తున్న కొద్దీ, ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో పసివాళ్ల కిలకిలా రావాలు పెరుగుతూ వచ్చాయి. ఈ ప్రక్రియ రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగింది. లేడీ లాయల్ హాస్పిటల్ వైద్యులు 132 సంవత్సరాల చరిత్రలో రికార్డు సృష్టించారు. ఇక్కడ రోజుకు సగటున 15 సాధారణ డెలివరీలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఏకంగా ఒకే రోజులో 86 సిజేరియన్లు, 68 సాధారణ ప్రసవాలు జరిగాయి.  తెల్లవారుజామున నాలుగు గంటలకు లేడీ లాయల్ ఆసుపత్రిలో వైద్యులు డెలివరీలు చేసేందుకు సిద్ధమయ్యారు. మొదటి డెలివరీ రాజ్‌పూర్‌కు చెందిన రీనాతో ప్రారంభించానని డాక్టర్ సంగీత చెప్పారు. రాత్రి 11.40 గంటలకు షాహీద్ నగర్ కు చెందిన అమీరాకు చివరి ఆపరేషన్ జరిగింది. ఇదిలా ఉండగా కరోనా ఇన్ఫెక్షన్ విషయంలో ఆగ్రా ముందుంటోంది. ఆగ్రాలో కరోనా కేసుల సంఖ్య 371 కు చేరుకుంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 400 కంటే ఎక్కువగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఆగ్రాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 9కి చేరుకుంది. 

Updated Date - 2020-04-26T16:01:16+05:30 IST