అమెరికాలో క‌రోనా కొత్త రికార్డు.... 24 గంట‌ల్లో 70 వేల పాజిటివ్ కేసులు!

ABN , First Publish Date - 2020-07-11T15:31:16+05:30 IST

ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ సంక్షోభానికి అమెరికా అధికంగా ప్ర‌భావిత‌మ‌య్యింది. గ‌డ‌చిన‌ 24 గంటల్లో అమెరికాలో 70వేల‌కు మించి కరోనా కేసులు నమోదయ్యాయి. ఏ దేశంలోనూ లేనంత రీతిలో...

అమెరికాలో క‌రోనా కొత్త రికార్డు.... 24 గంట‌ల్లో 70 వేల పాజిటివ్ కేసులు!

న్యూయార్క్‌: ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ సంక్షోభానికి అమెరికా అధికంగా ప్ర‌భావిత‌మ‌య్యింది. గ‌డ‌చిన‌ 24 గంటల్లో అమెరికాలో 70వేల‌కు మించి కరోనా కేసులు నమోదయ్యాయి. ఏ దేశంలోనూ లేనంత రీతిలో అమెరికాలో ఒక్క రోజులో అత్య‌ధిక కేసులు న‌మోద‌య్యాయి. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం అమెరికాలో ఇప్పటివరకు 31,83,856 మంది కరోనాతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,24,61,962 మందికి కరోనా వైరస్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో ఇప్పటివరకు 5,59,481 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా క‌రోనాకు చికిత్స పొందిన తరువాత 68,35,987 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇదిలావుండ‌గా కరోనా వైర‌స్‌ మూలాన్ని తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇద్దరు నిపుణులు చైనా రాజధాని బీజింగ్‌లో రెండు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు.

Updated Date - 2020-07-11T15:31:16+05:30 IST