కేంద్ర మంత్రి ఎస్.జైశంకర్ కు మాతృ వియోగం

ABN , First Publish Date - 2020-09-20T16:19:00+05:30 IST

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి సులోచన సుబ్రహ్మణ్యం శనివారం

కేంద్ర మంత్రి ఎస్.జైశంకర్ కు మాతృ వియోగం

న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి సులోచన సుబ్రహ్మణ్యం శనివారం అర్ధరాత్రి కన్ను మూశారు. ఈ విషయాన్ని జైశంకర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘‘మా అమ్మ సులోచన సుబ్రహ్మణ్యం కన్ను మూశారన్న విషయాన్ని తీవ్ర బాధతో ప్రకటిస్తున్నా. ఆమె అనారోగ్యంగా ఉన్న సమయంలో మద్దతు ఇచ్చిన వారందరికీ మా కుటుంబం పక్షాన కృతజ్ఞతలు ప్రకటిస్తున్నాం’’ అని జైశంకర్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-09-20T16:19:00+05:30 IST