కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత
ABN , First Publish Date - 2020-10-09T02:36:51+05:30 IST
కేంద్ర మంత్రి, లోక్ జన్ శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని...

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, లోక్ జన్ శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. ఆయన వయసు 74 సంవత్సరాలు. రాంవిలాస్ పాశ్వాన్ 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మృతికి కారణం గుండెపోటుగా తెలిసింది. ప్రధాని మోదీ కేబినెట్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా రాం విలాస్ పాశ్వాన్ కొనసాగుతున్నారు. దేశంలోని కీలక దళిత నేతల్లో పాశ్వాన్ ఒకరు. పాశ్వాన్ ఇక లేరనే వార్తతో ఎల్‌జేపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.