కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-13T00:28:56+05:30 IST

కేంద్ర ఆయుశ్ మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు బుధవారం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ

కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : కేంద్ర ఆయుశ్ మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు బుధవారం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘ఈ రోజు నేను కరోనా పరీక్షలు నిర్వహించుకున్నా. అందులో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నా. నాతో వివిధ కార్యక్రమాల్లో భాగంగా టచ్‌లోకి వచ్చిన వారందరూ కరోనా పరీక్షలు నిర్వహించుకోండి. తగు జాగ్రత్తలు తీసుకోండి’’ అని యశో నాయక్ సూచించారు. 


Updated Date - 2020-08-13T00:28:56+05:30 IST