చైనా చొరబాటు యత్నాలపై గడ్కరీ కామెంట్స్

ABN , First Publish Date - 2020-06-26T04:36:41+05:30 IST

న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి వచ్చేందుకు చైనా యత్నించిందని అయితే దీటుగా తిప్పికొట్టగలిగామని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ ర్యాలీ ద్వారా ఆయన ప్రసంగించారు.

చైనా చొరబాటు యత్నాలపై గడ్కరీ కామెంట్స్

న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి వచ్చేందుకు చైనా యత్నించిందని అయితే దీటుగా తిప్పికొట్టగలిగామని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ ర్యాలీ ద్వారా ఆయన ప్రసంగించారు. భారత సరిహద్దులు సురక్షితంగా లేకపోవడం వల్లే లోపలికి వచ్చేందుకు చైనా యత్నించిందని అయితే గట్టిగా బదులిచ్చామని చెప్పారు. లడక్ గల్వాన్ లోయ ఘటనను ఆయన ప్రస్తావించారు.


వాజ్‌‌పేయి హయాం నుంచి భారత్ పొరుగుదేశాలతో సత్సంబంధాలుండేలా చర్యలు తీసుకుందని గడ్కరీ చెప్పారు. అయితే భారత్ ఏనాడూ విస్తరణ కాంక్షతో లేదని గడ్కరీ స్పష్టం చేశారు. చిన్న చిన్న దేశాలకు సంబంధించి కూడా ఒక్క అంగుళం భూమిని కూడా భారత్ ఏనాడూ ఆక్రమించలేదని గడ్కరీ చెప్పారు. పోరాడి బంగ్లాదేశ్ ఏర్పాటు చేశామే కానీ ఆ దేశాన్ని ఆక్రమించలేదని కూడా గడ్కరీ చెప్పారు.  


Updated Date - 2020-06-26T04:36:41+05:30 IST