ఆరెస్సెసే నా విజయానికి కారణం
ABN , First Publish Date - 2020-12-27T09:49:22+05:30 IST
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) యోధులు నేర్పిన సంస్కారం వల్లే రాజకీయ జీవితంలో విజయం సాధించానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
నాగ్‌పూర్, డిసెంబరు 26: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) యోధులు నేర్పిన సంస్కారం వల్లే రాజకీయ జీవితంలో విజయం సాధించానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. యశ్వంత్‌రావ్ ఖే ల్కర్, దత్తోపంత్ తేంగ్డీ వంటి ఆరెస్సెస దిగ్గజాల నుంచి తాను నేర్చుకున్న సంస్కారమే ఇప్పుడు తానున్న స్థితికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఆరెస్సెస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 66వ జాతీయ స్నాతకోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో నిర్వహించిన యశ్వంత్‌రావ్ ఖేల్కర్ యువ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు.