‘ఉమ్మడి పౌరస్మృతి’ అమలు చేయాల్సిందే : రౌత్

ABN , First Publish Date - 2020-10-28T21:49:43+05:30 IST

ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాల్సిందేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి చట్టాన్ని తేస్తే... దీనిపై

‘ఉమ్మడి పౌరస్మృతి’ అమలు చేయాల్సిందే : రౌత్

ముంబై : ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాల్సిందేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి చట్టాన్ని తేస్తే... దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ‘‘ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని గతంలోనే మేము పేర్కొన్నాం. మోదీ ప్రభుత్వం అలాంటి దానిని అమలు చేయాలని భావిస్తే, దీనిపై మేము ఓ నిర్ణయం తీసుకుంటాం.’’ అని రౌత్ తెలిపారు. చైనా సహాయంతో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామన్న ఫరూక్ అబ్దుల్లాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కశ్మీర్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని వారిని తాము దేశ ద్రోహులుగానే పరిగణిస్తామని రౌత్ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-10-28T21:49:43+05:30 IST