యూఎన్‌హెచ్‌సీఆర్ చీఫ్‌కు కోవిడ్-19 పాజిటివ్
ABN , First Publish Date - 2020-10-08T00:55:38+05:30 IST
ఐక్య రాజ్య సమితి శరణార్థుల విభాగాధిపతి ఫిలిపో గ్రాండికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది. ఈ సమాచారాన్ని

జెనీవా : ఐక్య రాజ్య సమితి శరణార్థుల విభాగాధిపతి ఫిలిపో గ్రాండికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది. ఈ సమాచారాన్ని ఆయన స్వయంగా బుధవారం వెల్లడించారు.
ఫిలిపో బుధవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో తనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు తెలిపారు. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐక్య రాజ్య సమితి శరణార్థుల విభాగం కార్యనిర్వాహక కమిటీ కార్యకలాపాలను తన నివాసం నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యమని చెప్పారు.