భగవద్గీత ఒక జ్ఞాన సంపద!

ABN , First Publish Date - 2020-12-27T09:12:37+05:30 IST

యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) ఆడ్రే అజౌలే శనివారం గీతా జయంత్రి, క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ ఏడాది క్రిస్మస్‌ రోజునే గీతా జయంతి కూడా.

భగవద్గీత ఒక జ్ఞాన సంపద!

గీతాజయంతి, క్రిస్మస్‌ శుభాకాంక్షలు: యునెస్కో డీజీ


న్యూఢిల్లీ, డిసెంబరు 26: యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) ఆడ్రే అజౌలే శనివారం గీతా జయంత్రి, క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ ఏడాది క్రిస్మస్‌ రోజునే గీతా జయంతి కూడా. 55 శతాబ్దాల క్రితం ఇదే రోజున భగవద్గీత, శ్రీకృష్ణుడి నోటి వెంట వెలువడింది. ఆత్మ నాశనం లేనిది. ఆత్మను అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, వాయువు ఆర్పలేదు. భగవద్గీతలో చెప్పిన ఆత్మ ప్రయాణం, 2021కు కొత్త ఆశను తీసుకొస్తుందని ఆశిద్దాం. అందరికీ గీతా జయంతి, క్రిస్మస్‌ శుభాకాంక్షలు. భగవద్గీత ఒక సాహిత్య కళాఖండం. అపార జ్ఞాన సంపద’’ అని ఆడ్రే ట్వీట్‌ చేశారు. ‘‘అర్జునుడికి, కృష్ణుడికి మధ్య సంవాదంపై యునెస్కో డీజీ చెప్పినట్లుగా 2021ని ఒక కొత్త ఆశతో, ప్రేమతో ఆహ్వానిద్దాం. అందరికీ గీతా జయంతి, క్రిస్మస్‌ శుభాకాంక్షలు’’ అని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ స్పందించారు.

Updated Date - 2020-12-27T09:12:37+05:30 IST