వికాస్ దూబే ఎన్‌కౌంటర్ : ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన ఉమా భారతి
ABN , First Publish Date - 2020-07-11T02:41:04+05:30 IST
కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే ఎన్‌కౌంటర్ పై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే.

లక్నో : కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే ఎన్‌కౌంటర్ పై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా... స్వపక్షం నుంచే యోగి ప్రభుత్వంపై దాడి మొదలైంది. బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ ఉమా భారతి దూబే ఎన్‌కౌంటర్ పై ప్రభుత్వానికి మూడు ప్రశ్నలను సంధించారు. దీంతో ఆమె ప్రతిపక్షాలతో గొంతు కలిపినట్లైంది. ఆ ఎన్‌కౌంటర్ మిస్టరీ ఇప్పటికీ మూడు కోణాలను చూపించడం లేదంటూ...
1. దూబే ఉజ్జయినికి ఎలా చేరాడు? 2. మహాంకాళి గుడి ప్రాంగణంలో దూబే ఎంత సమయం గడిపాడు? ఆయన్ను గుర్తించడంలో ఎందుకు అంత సమయం తీసుకున్నారు? 3. పోలీసులను ఎన్ కౌంటర్ చేసిన తర్వాత ఆయన ముఖచిత్రం టీవీల్లో కనిపిస్తూనే ఉంది కదా... అంటూ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంపై తాను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు హోంమంత్రి నరోత్తం మిశ్రాతో మాట్లాడతానని ఉమా భారతి స్పష్టం చేశారు.