షాకింగ్: దివాళా అంచులకు బ్రిటన్ చేరేలా చేసిన కరోనా..!
ABN , First Publish Date - 2020-06-24T01:10:34+05:30 IST
కరోనా సంక్షోభం ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఎంతటి ప్రభావం చూపించిందో బ్రిటన్ కేంద్ర బ్యాంకు గవర్నర్ తాజాగా వ్యాఖ్యలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

లండన్: కరోనా సంక్షోభం ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎంత తీవ్రంగా ఉందో బ్రిటన్ కేంద్ర బ్యాంకు గవర్నర్ తాజాగా వ్యాఖ్యలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సంక్షోభం తీవ్రంగా ఉన్నప్పుడు ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి..బ్రిటన్ దివాళ అంచులకు చేరుకుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ ఆండ్రూ బెయిలీ తాజాగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కొన్ని బ్రిటన్ కంపెనీలు ఈ సంక్షోభానికి బలైపోతాయని కూడా ఆయన హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం శాశ్వతమైనదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. కాగా.. కరోనా నుంచి బ్రిటన్‌కు కాపాడేందుకు కేంద్ర బ్యాంకు ఇప్పటి వరకూ ఆ దేశ మార్కెట్లలోకి 200 బలియన్ పౌండ్ల నగదును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ బాండ్ల జారీ చేయడం ద్వారా సదరు బ్యాంకు మార్కెట్లో నిధుల లభ్యతకు లోటు లేకుండా చేసింది.