కరోనా ఎఫెక్ట్: దంపతులకు ప్రభుత్వ హెచ్చరిక!

ABN , First Publish Date - 2020-03-25T19:42:46+05:30 IST

కరోనా రూపంలో అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్న బ్రిటన్ కూడా దాదాపు లాక్ డౌన్‌లోకి వెళ్లింది. అయితే అక్కడి జంటలకు లేదా మాత్రం ఇది కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

కరోనా ఎఫెక్ట్: దంపతులకు ప్రభుత్వ హెచ్చరిక!

లండన్: కరోనా రూపంలో అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్న బ్రిటన్ కూడా దాదాపు లాక్ డౌన్‌లోకి వెళ్లింది. అయితే అక్కడి జంటలకు మాత్రం ఇది కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ప్రేమలో లేదా వైవాహిక బంధంలో ఉన్న వారిలో అనేక మంది వృత్తి, ఇతర కారణాల రీత్యా వేరువేరుగా ఉంటున్నారు. దేశంలో మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిన నేపథ్యంలో వారిని ఓ ప్రశ్న వేధిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో తమ వారి దగ్గరకు వెళ్లాలా వద్దా? వారితో కలిసి ఉండాలా.. విడిగా ఉండాలా?.. ప్రస్తుతం బ్రిటన్‌లోని అనేక జంటలను వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం తాజాగా స్పందించింది. కలిసుండాలో వద్దో వెంటనే తేల్చుకుని దానికే కట్టుబడి ఉండాలని సూచించింది. ఓసారి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండకపోతే.. కరోనాను కట్టడి చేయాలనే లక్ష్యం దెబ్బతింటుందని హెచ్చరించింది. ఓ కుటుంబ సభ్యుడికి కరోనా వస్తే అది కుటుంబమంతా వ్యాప్తిస్తుంది కాబట్టి...విడిగా ఉన్న జంటలు కలిసుండాలో వద్దో తేల్చుకుని అదే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. దూరంగా ఉంటేనే మంచిదనే సందేశాన్ని పరోక్షంగా పంపించింది.

Read more