ఒక్క ఇంజెక్షన్‌తో కరోనా నుంచి తక్షణ రక్షణ!

ABN , First Publish Date - 2020-12-27T09:47:34+05:30 IST

కరోనా నుంచి కోలుకున్న వారిలో.. యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయో తెలియని అయోమయం!! వ్యాక్సిన్‌ అందే వరకు వైరస్‌ నుంచి రక్షణ

ఒక్క ఇంజెక్షన్‌తో  కరోనా నుంచి తక్షణ రక్షణ!

‘ఏజెడ్‌డీ7442’లోని కృత్రిమ యాంటీబాడీలతో ఏడాదిపాటు ఆరోగ్య భద్రత

ప్రయోగ పరీక్షలు ప్రారంభించిన యూకే శాస్త్రవేత్తలు


లండన్‌, డిసెంబరు 26: కరోనా నుంచి కోలుకున్న వారిలో.. యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయో తెలియని అయోమయం!! వ్యాక్సిన్‌ అందే వరకు వైరస్‌ నుంచి రక్షణ ఎలా పొందాలో అనే భయం!! ఈనేపథ్యంలో కరోనా వైర్‌సను నిర్వీర్యం చేసి, తక్షణ రక్ష ణ కల్పించగల సరికొత్త యాంటీబాడీ ఇంజెక్షన్‌తో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లోని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ హాస్పిటల్స్‌ (యూసీఎల్‌హెచ్‌) శాస్త్రవేత్తలు ప్రయోగ పరీక్షలను ప్రారంభించారు. ఇది సింగిల్‌ డోసు వేయించుకుంటే ఆరు నెలల నుంచి ఏడాదిపాటు ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ లభిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆస్ట్రాజెనెకా కంపెనీ అభివృద్ధిచేసిన ‘ఏజెడ్‌డీ7442’ అనే ఔషఽధాన్ని ఈ ఇంజెక్షన్‌ ద్వారా అందిస్తారన్నా రు. సాధారణంగా వ్యాక్సిన్‌ వేయించుకుంటే... రోగ నిరోధక వ్యవస్థ స్పందించి స్వయంగా యాంటీబాడీలను విడుదల చేస్తుంది. దాని స్థానంలో ఈ యాంటీబాడీ ఇంజెక్షన్‌ వేయించుకుంటే.. రెండు కృత్రిమ (మోనోక్లోనల్‌) యాంటీబాడీలు వెంటనే శరీరంలోకి విడుదలవుతాయి. అవి వెంటనే వైర్‌సను నిర్వీర్యం చేసే పనిని ప్రారంభించి, దాదాపు ఏడాది పాటు ఇన్ఫెక్షన్‌ గండం నుంచి రక్షణ కల్పిస్తాయి. 

Updated Date - 2020-12-27T09:47:34+05:30 IST