పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: లద్దాఖ్ ఘర్షణపై బ్రిటన్ ప్రధాని కామెంట్!

ABN , First Publish Date - 2020-06-25T17:40:55+05:30 IST

భారత్ చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై బ్రిటన్ ప్రధాని తాజాగా స్పందించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా గంభీరంగా ఉందని, ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన వ్యాఖ్యానించారు.

పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: లద్దాఖ్ ఘర్షణపై బ్రిటన్ ప్రధాని కామెంట్!

లండన్: భారత్ చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తాజాగా స్పందించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా గంభీరంగా ఉందని, ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన వ్యాఖ్యానించారు. పరిస్థితిని బ్రిటన్ నిశితంగా గమనిస్తోందని కూడా ప్రధాని తెలిపారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఇరు దేశాలు చర్చలు చేపట్టాలని బోరిస్ భారత్ చైనాకు పిలుపునిచ్చారు.


‘సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు చేపట్టాలని ఇరు దేశాలకు పిలుపునిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో నేను చెయదగిన సూచన ఇదే’ అని ఆయన అన్నారు. చైనా-భారత్‌ వివాదం బ్రిటన్‌పై ఏమేరకు ప్రభావం చూపిస్తుందంటూ పార్లమెంట్ సభ్యుడు ఫ్లిక్ డ్రమ్మండ్ అడిగిన ప్రశ్నకు ప్రధాని ఈ మేరకు సమాధానం చెప్పారు. మరోపైపు.. సరిహద్దు వద్ద మునుపటి స్థితికి చేరుకోవాలని భారత్ చైనాలు అంగీకరించాయని భారత్ విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. వాస్తవాధీన రేఖ వద్ద శాంతి నెలకొల్పే దిశగా బలగాలను ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాలు ఏకాభ్రిప్రాయానికి వచ్చాయని తెలిపింది. 


Updated Date - 2020-06-25T17:40:55+05:30 IST