గణిత మేధావి శకుంతలా దేవికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సర్టిఫికెట్‌

ABN , First Publish Date - 2020-07-31T08:04:38+05:30 IST

అత్యంత వేగంగా అంకెలను గణించి రికార్డు సృష్టించిన భారత గణిత మేధావి

గణిత మేధావి శకుంతలా దేవికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సర్టిఫికెట్‌

న్యూఢిల్లీ, జూలై 30: అత్యంత వేగంగా అంకెలను గణించి రికార్డు సృష్టించిన భారత గణిత మేధావి స్వర్గీయ శంకుతలా దేవీ పేరిట గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌.. సర్టిఫికెట్‌ ప్రకటించింది. దీన్ని ఆమె కూతురు అనుపమా బెనర్జీకి అందజేశా రు. నలభై ఏళ్ల క్రితం శ కుంతలా దేవి ఈ రికార్డు నమోదు చేశారు. రెండు 13 అంకెల సంఖ్యలను గుణించి 28 సెకన్ల వ్యవధిలోనే సమాధానం చెప్పి సంచలనం సృష్టించారు. 1980 జూన్‌ 18న యూకేలోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌లో ఈ ఘనత సాధించారు. శకుంతలా దేవి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన ‘శకుంతలా దేవి’ చిత్రం శుక్రవారం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం కాబోతోంది.  


Updated Date - 2020-07-31T08:04:38+05:30 IST