థీసిస్ సమర్పణకు మరో 6 నెలలు : యూజీసీ
ABN , First Publish Date - 2020-12-05T07:53:05+05:30 IST
ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులు తమ పరిశోధన సిద్ధాంతాన్ని సమర్పించేందుకు గడువును ఆరు నెలల వరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పొడిగించింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో...

న్యూఢిల్లీ, డిసెంబరు 4: ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులు తమ పరిశోధన సిద్ధాంతాన్ని సమర్పించేందుకు గడువును ఆరు నెలల వరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పొడిగించింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో యూజీసీ పేర్కొంది. థీసీ్సను సమర్పించేందుకు గడువు తేదీ డిసెంబరు 31 కాగా, దానిని వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగించింది. కాగా, పీహెచ్డీ, ఎంఫిల్ ఫెలోషిప్ కాలవ్యవధిలో యూజీసీ ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతమున్న ఐదు సంవత్సరాల విధానమే కొనసాగుతుంది.