24 యూనివర్సిటీలు ఫేక్ : యూజీసీ
ABN , First Publish Date - 2020-10-08T03:54:28+05:30 IST
దేశంలో గుర్తింపు లేకుండా చెలామణీ అవుతున్న ‘‘నకిలీ యూనివర్సిటీలు’’ 24 వరకు ..

న్యూఢిల్లీ: దేశంలో గుర్తింపు లేకుండా చెలామణీ అవుతున్న ‘‘నకిలీ యూనివర్సిటీలు’’ 24 వరకు ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది. ఇందులో అత్యధిక ఫేక్ యూనివర్సిటీలు యూపీలో ఉండగా... తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. ‘‘యూజీసీ చట్టానికి విరుద్ధంగా కొనసాగుతున్న స్వయం ప్రకటిత, గుర్తింపులేని యూనివర్సిటీలు 24 వరకు ఉన్నాయని విద్యార్ధులు, తలిదండ్రులకు తెలియజేస్తున్నాం. యూజీసీ వీటిని నకిలీ యూనివర్సిటీలుగా ప్రకటించింది. వీటికి ఎలాంటి డిగ్రీలూ ఇచ్చే అధికారం లేదు...’’ అని యూజీసీ సెక్రటరీ రజనీశ్ జైన్ పేర్కొన్నారు. ఇందులో ఎనిమిది వరకు ఉత్తర ప్రదేశ్ నుంచి ఉండగా.. ఢిల్లీ నుంచి ఏడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి రెండేసి చొప్పున ఉన్నాయి. కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్టు యూజీసీ వెల్లడించింది.