‘సామ్నా’ చీఫ్ ఎడిటర్‌గా ఉద్ధవ్ భార్య
ABN , First Publish Date - 2020-03-02T08:09:30+05:30 IST
శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ప్రధాన సంపాదకురాలిగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే ..

న్యూఢిల్లీ, మార్చి 1: శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ప్రధాన సంపాదకురాలిగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే నియమితులయ్యారు. ఉద్ధవ్ సీఎం అయిన నాటి నుంచి సామ్నా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్ రౌత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా కొనసాగుతారని ఆదివారం సంచికలో ప్రకటించారు. అయితే, సంజయ్‌ను చీఫ్ ఎడిటర్‌గా ఎందుకు నియమించలేదంటూ ఆయన అభిమానులు ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. శివసేనకు కాకుండా ఠాక్రే కుటుంబ మౌత్‌పీ్‌సగా ‘సామ్నా’ మారిందని మరికొందరు విమర్శిస్తున్నారు.