సీఎం ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్స్

ABN , First Publish Date - 2020-09-06T22:59:20+05:30 IST

ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అజ్ఞాత నేర ప్రపంచ నేత, కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం పేరుతో ఈ కాల్స్ ..

సీఎం ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్స్

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే నివాసమైన 'మాతోశ్రీ'ని పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. స్వయంగా ఉద్ధవ్‌కు ఈ కాల్స్ వచ్చాయని సమాచారం. ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అజ్ఞాత నేర ప్రపంచ నేత, కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం పేరుతో ఈ కాల్స్ వచ్చాయని చెబుతున్నారు. దుబాయ్ నుంచి మొత్తం నాలుగు బెదిరింపు కాల్స్ వచ్చాయంటున్నారు. కాగా, సీఎంకు వచ్చిన బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రతను మరింత పెంచారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Updated Date - 2020-09-06T22:59:20+05:30 IST