మే నెలాఖరు వరకూ మహారాష్ట్రలో లాక్‌డౌన్!

ABN , First Publish Date - 2020-05-08T16:21:29+05:30 IST

మహారాష్ట్రలోని కోవిడ్ కేసుల్లో అత్యధికం ముంబై, పూణే నగరాల నుంచే అత్యధిక కేసులు నమోదు కావడంతోనే

మే నెలాఖరు వరకూ మహారాష్ట్రలో లాక్‌డౌన్!

ముంబై : ఉద్ధవ్ నేతృత్వంలోని మహా సర్కార్ లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌ను మే నెల చివరి వరకూ పొడగించాలని సీఎం ఉద్ధవ్ సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ లాక్‌డౌన్ పొడగింపు కేవలం రెడ్ జోన్లతో పాటు ముంబై, పూణె నగరాలకు మాత్రమే పరిమితమని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలోనే అఖిలపక్ష నేతలతో లాక్‌డౌన్‌ను పొడగించాలని సూచన ప్రాయంగా ప్రకటించారు. మహారాష్ట్రలోని కోవిడ్ కేసుల్లో అత్యధికం ముంబై, పూణే నగరాల నుంచే అత్యధిక కేసులు నమోదు కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ అఖిల పక్ష సమావేశంలో నాయకులందరూ కోవిడ్‌ను అరికట్టే విషయంలో తగు సూచనలు చేశారు. 

Updated Date - 2020-05-08T16:21:29+05:30 IST