యూఏఈలో అణువిద్యుత్ కేంద్రం ప్రారంభం.. అరబ్ దేశాల్లోనే తొలిసారిగా..

ABN , First Publish Date - 2020-08-02T01:52:17+05:30 IST

యూఏఈలో అణువిద్యుత్ కేంద్రాన్ని విజయవంతంగా ప్రారంభించినట్లు ఆ దేశ ప్రధాని మహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తుం వెల్లడించారు. దీంతో అరబ్ దేశాల్లోనే...

యూఏఈలో అణువిద్యుత్ కేంద్రం ప్రారంభం.. అరబ్ దేశాల్లోనే తొలిసారిగా..

దుబాయ్: యూఏఈలో అణువిద్యుత్ కేంద్రాన్ని విజయవంతంగా ప్రారంభించినట్లు ఆ దేశ ప్రధాని మహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తుం వెల్లడించారు. దీంతో అరబ్ దేశాల్లోనే తొలి కమర్షియల్అణువిద్యుత్ కేంద్ర కలిగిన దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా మక్తుం మాట్లాడుతూ, తమ దేశంలో తొలిసారిగా కమర్షియల్ అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. నిపుణుల బృందం విజయవంతంగా అణు ఇంధనాన్ని ఇందులో ప్రవేశపెట్టి విజయవంతంగా పరీక్షించిందని వెల్లడించారు. దీనికి బరాక్ స్టేషన్‌ అని పేరు పెట్టామని, ఈ కేంద్రం అబుదాబీలో ఉందని మక్తుం తెలిపారు.

Updated Date - 2020-08-02T01:52:17+05:30 IST