కరోనా ఎఫెక్ట్: ఒక్కరోజులో సుమారు 2వేలమంది మృతి

ABN , First Publish Date - 2020-04-09T03:54:16+05:30 IST

కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అల్లాడిపోతోంది. ఈ వైరస్ వల్ల తీవ్రంగా నష్టపోతున్న దేశం అమెరికానే.

కరోనా ఎఫెక్ట్: ఒక్కరోజులో సుమారు 2వేలమంది మృతి

వాషింగ్టన్: కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అల్లాడిపోతోంది. ఈ వైరస్ వల్ల తీవ్రంగా నష్టపోతున్న దేశం అమెరికానే. ఈ క్రమంలో గడిచిన 24గంటల్లో అమెరికాలో కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 1,939 కరోనా బాధితులు తుదిశ్వాస విడిచినట్లు జాన్స్ హాప్‌కిన్స్ కరోనా ట్రాకర్ సూచిస్తోంది. ఒక్కరోజులో కరోనా కారణంగా అమెరికాలో సంభవించిన మరణాల్లో ఇదే అత్యధికం. ఇప్పటికే ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలు దాటేసింది. మొత్తం కరోనా కేసులు 4,06,693కాగా వారిలో 13,089మంది కన్నుమూశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని అధికారులు చెప్తున్నారు.

Updated Date - 2020-04-09T03:54:16+05:30 IST