షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల హతం
ABN , First Publish Date - 2020-10-14T20:19:02+05:30 IST
జమ్మూకశ్మీరులోని షోపియాన్ జిల్లా చాకుర ప్రాంతంలో బుధవారం ఉదయం ఉగ్రవాదులకు, సెక్యూరిటీ బలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.

షోపియాన్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని షోపియాన్ జిల్లా చాకుర ప్రాంతంలో బుధవారం ఉదయం ఉగ్రవాదులకు, సెక్యూరిటీ బలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారని జమ్మూకశ్మీరు పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.