పుల్వామాలో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

ABN , First Publish Date - 2020-06-23T12:18:12+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా బండ్ జూ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.....

పుల్వామాలో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

జవాన్ మృతి

పుల్వామా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా బండ్ జూ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని బండ్ జూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర 55 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్ జవాన్లతోపాటు జమ్మూకశ్మీర్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున గాలింపు చేపట్టారు. బండ్ జూ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులు గాలిస్తున్న భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో తాము ఎదురుకాల్పులు జరిపామని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. భద్రతా జవాన్లు జరిపిన కాల్పుల్లో గుర్తుతెలియని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని విజయకుమార్ చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్ లో ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్ అనంతరం మరణించాడని విజయ్ కుమార్ చెప్పారు. ఉగ్రవాదుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతుందని ఐజీ విజయ్ కుమార్ వివరించారు. 

Read more