లాక్‌డౌన్‌ లెక్క చేయకుండా మద్యం అమ్మకాలు

ABN , First Publish Date - 2020-04-05T00:19:10+05:30 IST

ఈ విషయమై బెంగళూరు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు సందీప్ పాటిల్ మాట్లాడుతూ ‘‘దేశంతో పాటు నగరంలో కూడా పూర్తి లాక్‌డౌన్ అమలు జరుగుతోంది. మాల్స్, పబ్సులు, వైన్ షాపులు అన్నీ బంద్ ఉన్నాయి. అయితే కొందరు

లాక్‌డౌన్‌ లెక్క చేయకుండా మద్యం అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించిన నాటి నుంచి నిత్యవసరాలు మినహా మరేవీ అందుబాటులో లేవు. అయితే బెంగళూరులో మద్యం అమ్మకాలు మాత్రం జరుగుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు రహస్యంగా మద్య అమ్మకాలు చేస్తున్నారు. ఇది ఆ నోటా ఈ నోటా పోలీసుల వరకు వెళ్లింది. ఇంకేంటి, మద్యం అమ్ముతున్న ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు వంద మందు సీసాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.


ఈ విషయమై బెంగళూరు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు సందీప్ పాటిల్  మాట్లాడుతూ ‘‘దేశంతో పాటు నగరంలో కూడా పూర్తి లాక్‌డౌన్ అమలు జరుగుతోంది. మాల్స్, పబ్సులు, వైన్ షాపులు అన్నీ బంద్ ఉన్నాయి. అయితే కొందరు అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. నిర్బంధ సమయాన్ని ఆదాయ మార్గంగా భావించి అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నాయి. అయితే వారిని పట్టుకున్నాం’’ అని అన్నారు.


అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు ధనుంజయ్ (29), సంజయ్ (29) అని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ నగరంలోని ఆర్‌టీ నగర్ ప్రాంతంలో ఉంటారని తెలిపారు. వారి నుంచి మద్యం సీసాలతో పాటు 1.25 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-04-05T00:19:10+05:30 IST