కశ్మీర్‌లో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతం

ABN , First Publish Date - 2020-12-25T08:38:54+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు జైషే మొమహ్మద్‌ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.

కశ్మీర్‌లో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌, డిసెంబరు 24: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు జైషే మొమహ్మద్‌ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. జిల్లాలోని క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాల వైపు ముష్కరులు కాల్పులు జరిపారు. బలగాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.  

Updated Date - 2020-12-25T08:38:54+05:30 IST