సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల సంచారం..బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పులు

ABN , First Publish Date - 2020-11-21T11:06:04+05:30 IST

జమ్మూకశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు అయిన సాంబ సెక్టారులో పాకిస్థాన్ దేశం నుంచి అక్రమంగా వచ్చిన రెండు డ్రోన్లు ఆకాశంలో కనిపించాయి.....

సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల సంచారం..బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పులు

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు అయిన సాంబ సెక్టారులో పాకిస్థాన్ దేశం నుంచి  అక్రమంగా వచ్చిన రెండు డ్రోన్లు ఆకాశంలో కనిపించాయి. సరిహద్దుల్లోని సాంబ సెక్టారులో పాక్ డ్రోన్లు సంచరిస్తుండటంతో అప్రమత్తమైన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు కాల్పులు జరిపింది. ఫాకిరా సరిహద్దు చెక్ పోస్టు వద్ద గుర్తుతెలియని డ్రోన్ ఆకాశంలో కనిపించడంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. పాకిస్థాన్ ఔట్ పోస్టులోని చమన్ ఖుర్దు నుంచి వచ్చిన డ్రోన్ సాంబ సెక్టారులో తిరిగింది. బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపినా, డ్రోన్లు కాల్పుల నుంచి తప్పించుకొని పాకిస్థాన్ వైపు తిరిగి వెళ్లాయి. సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల సంచారం అనంతరం కేంద్ర భద్రతా దళాలు అప్రమత్తం అయి గాలింపు చేపట్టాయి. గతంలో డ్రోన్ల ద్వారా పాక్ తుపాకులను సరిహద్దులు దాటించి ఉగ్రవాదులకు అందజేసిందని తేలింది. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు సరిహద్దుల్లో గాలిస్తున్నారు.  

Read more