ఇద్దరూ కరోనా పేషెంట్లే.. పొరబాటున వదిలేశారట!

ABN , First Publish Date - 2020-04-25T01:57:08+05:30 IST

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఇద్దరూ కరోనా పేషెంట్లే.. పొరబాటున వదిలేశారట!

మొరాదాబాద్: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇద్దరు కరోనా పాజిటివ్ వ్యక్తులను క్వారంటైన్ నుంచి ఇంటికి పంపించేశారు. ఒకే రకం పేర్లుండటంతోనే ఈ పొరబాటు జరిగినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. ఈ తప్పిదాన్ని గుర్తించిన వెంటనే సదరు కరోనా పేషెంట్లను మళ్లీ క్వారంటైన్ సెంటర్‌కు తరలించినట్లు జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎమ్‌సీ గార్గ్ తెలిపారు. ఈ విషయంలో దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-25T01:57:08+05:30 IST