బీజేపీలోకి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!

ABN , First Publish Date - 2020-12-28T00:05:38+05:30 IST

వచ్చే ఏడాది అసోం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నాయకుల ఫిరాయింపుల ..

బీజేపీలోకి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!

గువాహటి: వచ్చే ఏడాది అసోం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నాయకుల ఫిరాయింపుల పర్వం మొదలైంది. ఈనెల 30వ తేదీలోగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు బీజేపీ అసోం రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్ ఆదివారంనాడు మీడియాకు తెలిపారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి బీజేపీలో చేరాలనుకుంటున్నట్టు చెప్పారని తెలిపారు. పార్టీ కోర్ కమిటీ  కమిటీ సమావేశమై వీరి చేరికను ఆమోదించాల్సి ఉంటుందని అన్నారు. ఈనెల 30వ తేదీలోగా ఆ పని పూర్తి చేస్తామని, నెలాఖరులోపు పార్టీలోకి తీసుకుంటామని చెప్పారు.


'పార్టీ స్క్రీనింగ్ కమిటీని శనివారంనాడు జరిగిన సమావేశంలో ఏర్పాటు చేశాం. స్క్రీనింగ్ కమిటీ ఆమోదం పొందిన వారెవరైనా పార్టీలో చేరవచ్చు' అని రంజిత్ కుమార్ దాస్ తెలిపారు. కాగా, ఈశాన్య ప్రాంతంలో మూడు రోజుల పర్యటన గాను హోం మంత్రి అమిత్‌షా శనివారం ఉదయం గువాహటి వచ్చారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిని ముఖ్యమంత్రి సర్బానంద సోనావాల్‌తో కలిసి సమీక్షించారు. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి పార్టీ ప్రాథమిక సభ్యత్వం కోల్పోయిన గోలాహట్ ఎమ్మెల్యే అజంతా నియోగ్ శనివారంనాడు అమిత్‌షాను కలుసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో బీజేపీలో చేరనున్నట్టు సమావేశానంతరం అజంతా నియోగ్ ప్రకటించారు. 

Updated Date - 2020-12-28T00:05:38+05:30 IST