ఆఫ్ఘనిస్థాన్‌లో పేలుళ్లు..17 మంది మృతి
ABN , First Publish Date - 2020-11-25T12:25:07+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది...

కాబూల్ (ఆఫ్ఘనిస్థాన్): ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో జరిగిన పేలుళ్లలో 17మంది మరణించారు. అత్యంత సురక్షిత ప్రాంతంగా పేరొందిన బమియాన్ ప్రావిన్సులో మొట్టమొదటిసారి పేలుళ్లు జరిగాయి. వేలాదిమంది పర్యాటకులు సందర్శించే బమియాన్ లో పేలుళ్లు జరగడం మొదటిసారి. ఈ పేలుళ్లకు కారణమెవరనేది ఇంకా ఎవరూ ప్రకటించలేదు. పేలుళ్లలో క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.