చైనాలో చెరువులోకి దూసుకు పోయిన బస్సు..21 మంది మ‌ృతి

ABN , First Publish Date - 2020-07-08T12:34:19+05:30 IST

వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ చెరువులోకి దూసుకుపోవడంతో 21 మంది ప్రయాణికులు మరణించిన దుర్ఘటన....

చైనాలో చెరువులోకి దూసుకు పోయిన బస్సు..21 మంది మ‌ృతి

బీజింగ్ (చైనా): వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ చెరువులోకి దూసుకుపోవడంతో 21 మంది ప్రయాణికులు మరణించిన దుర్ఘటన చైనా దేశంలోని గూయిజ్‌హౌ ప్రావిన్సులో జరిగింది. ఓ ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ రెయిలింగ్ ను ఢీకొని గూయిజ్‌హౌ ప్రావిన్సులోని అన్షున్ నగరంలోని హోంగ్ షాన్ చెరువులోకి దూసుకుపోయింది. చెరువునీటిలో బస్సు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 21 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చెరువులో పడిపోయిన బస్సును బయటకు వెలికితీసేందుకు యత్నిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తూ కొందరు ప్రయాణికులు గల్లంతవడంతో వారికోసం చెరువులో గాలిస్తున్నారు. 

Updated Date - 2020-07-08T12:34:19+05:30 IST