పన్నెండు రోజుల్లో పన్నెండు సార్లు... పెట్రో ధరల పెరుగుదల...

ABN , First Publish Date - 2020-12-01T21:43:05+05:30 IST

పెట్రోల్, డీజిల్ ధరల్లో నేడు మార్పులేదు. అయితే భోపాల్ వంటి పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 90ని దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ. 82.34, లీటర్ డీజిల్ ధర రూ. 72.42. ముంబైలో పెట్రోల్ రూ. 90 సమీపంలో ఉంది. లీటర్ పెట్రోల్ రూ. 89.02, డీజిల్ రూ. 78.97 గా ఉన్నాయి. గత 12 రోజుల్లో చమురు ధరలు 12సార్లు పెరిగాయి.

పన్నెండు రోజుల్లో పన్నెండు సార్లు... పెట్రో ధరల పెరుగుదల...

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల్లో నేడు మార్పులేదు. అయితే భోపాల్ వంటి పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 90ని దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ. 82.34,  లీటర్ డీజిల్ ధర రూ. 72.42. ముంబైలో పెట్రోల్ రూ. 90 సమీపంలో ఉంది. లీటర్ పెట్రోల్ రూ. 89.02, డీజిల్ రూ. 78.97 గా ఉన్నాయి. గత 12 రోజుల్లో చమురు ధరలు 12సార్లు పెరిగాయి. ఈ కాలంలో పెట్రోల్ ధరలు రూ.1 .28,  డీజిల్ ధర రూ. 1.96 చొప్పున పెరిగాయి. 


రెండు నెలల తర్వాత..

రెండు రోజుల క్రితం ఆదివారం పెట్రోల్ ధర 21 పైసలు, డీజిల్ 29 పైసల చొప్పున పెరిగాయి. కరోనా వ్యాక్సిన్ విషయంలో సానుకూల ప్రకటనల నేపథ్యంలో చమురు డిమాండ్ పెరుగుతుందనే అంచనాలున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దాదాపు రెండు నెలల విరామం అనంతరం నవంబర్ 20వ తేదీ నుండి కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి.


పెట్రోల్, డీజిల్ ధరలివీ... 

డిసెంబర్ 1 న దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.34, ముంబైలో రూ. 89.02, చెన్నైలో రూ. 85.31, కోల్‌కతాలో రూ. 83.87, హైదరాబాద్‌లో రూ. 85.64, బెంగళూరులో రూ. 85.09, గురుగ్రామ్‌లో రూ. 80.56, నోయిడాలో రూ. 82.62. 


డీజిల్ ధర విషయానికి వస్తే లీటర్ ఢిల్లీలో రూ. 72.42, ముంబైలో రూ. 78.97, చెన్నైలో రూ. 77.84,  కోల్‌కతాలో రూ. 75.99, హైదరాబాద్‌లో రూ. 79.02, బెంగళూరులో రూ. 76.77, గురుగ్రామ్‌లో రూ. 72.99, నోయిడాలో రూ. 72.83. 


ఈ నగరాల్లో రూ. 90 దాటింది... 

నవంబరు 30 న భోపాల్‌లో పెట్రోల్ ధర రూ. 90.05, డీజిల్ ధర రూ. 80.10. ఇండోర్‌లోను రూ. 90 దాటి రూ. 90.16 గా ఉంది.  ఔరంగాబాద్‌లో రూ. 90.25. 


పెట్రోల్ ధర రూ. 90 దాటిన నగరాలు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) ఇక్కడ 39 శాతం ఎక్కువగా ఉండడంతో రూ.90 ని క్రాస్ చేసిందని చెబుతున్నారు.

Updated Date - 2020-12-01T21:43:05+05:30 IST