లక్ష మాస్కులను విరాళంగా ఇచ్చిన టీవీఎస్ మోటార్ కంపెనీ

ABN , First Publish Date - 2020-09-18T00:01:07+05:30 IST

లక్ష మాస్కులను విరాళంగా ఇచ్చిన టీవీఎస్ మోటార్ కంపెనీ

లక్ష మాస్కులను విరాళంగా ఇచ్చిన టీవీఎస్ మోటార్ కంపెనీ

చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్‌-19 నివారణకు కఠిన చర్యలు చేపడుతున్న భారతదేశానికి తన వంతు సాయంగా టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ చేయూతనిచ్చింది. భారతదేశంలో ఉచితంగా పంపిణీ చేసేందుకు లక్ష మాస్కులను విరాళంగా అందించింది. కోవిడ్‌–19 మహమ్మారితో పోరాడుతున్న భారతదేశానికి సహాయంగా ఉచితంగా పంపిణీ చేసేందుకు లక్ష మాస్క్‌లను విరాళంగా ఇచ్చినట్లు దక్షిణ కొరియాకు చెందిన సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ అంగుక్ జెన్ సెంటర్ పేర్కొంది. విరాళానికి సంబంధించి కొరియాలోని కె–ఆర్ట్‌ ఇంటర్నేషనల్‌ ఎక్సేంజ్‌ అసోసియేషన్‌, భారతదేశంలోని ఇన్‌కో సెంటర్ సమన్వయం చేశాయి.


టీవీఎస్‌ మోటార్‌ కంపెనీకి చెందిన సామాజిక సేవా విభాగం శ్రీనివాస్‌ సర్వీసెస్‌ ట్రస్ట్‌ ద్వారా ఉచిత పంపిణీ కోసం అందజేశారు. ఈ సంక్షోభ కాలంలో సమయానికి అత్యంత విలువైన మాస్కులను విరాళంగా అందించడాన్ని స్వాగతిస్తున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ అత్యున్నత నాణ్యత కలిగిన మాస్కులను బ్లూఇండస్ కో. లిమిటెడ్ ఉత్పత్తి చేసింది.

Updated Date - 2020-09-18T00:01:07+05:30 IST