బుల్లితెర నటి కుమారుడి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2020-10-07T14:24:55+05:30 IST

తమిళ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న నటి శాంతి కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక విరుగంబాక్కం నటేశన్‌ నగర్‌ ప్రాంతంలో ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్స్‌లోని...

బుల్లితెర నటి కుమారుడి అనుమానాస్పద మృతి

చెన్నై : తమిళ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న నటి శాంతి కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక విరుగంబాక్కం నటేశన్‌ నగర్‌ ప్రాంతంలో ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలో జాకబ్‌ విలియం, శాంతి దంపతులు నివసిస్తున్నారు. శాంతి ‘మెట్టిఒళి’ తదితర తమిళ సీరియల్స్‌లో నటించారు. కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించారు. వీరికి సంతోష్‌ (34), ప్రశాంత్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. సంతోష్‌కు వివాహమై భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అతడికి తాగుడు అలవాటు ఉంది. రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకున్న సంతోష్‌ తన గదిలో నిద్రపోయాడు. వేకువజామున ఆ గదిలోనుండి ఎలాంటి అలికిడి వినకపోవడంతో సోదరుడు ప్రశాంత్‌ ఆ గదిలోకి వెళ్ళి చూశాడు. సంతోష్‌ ఉలుకూపలుకూ లేకుండా శవంగా పడి ఉండటం చూసి దిగ్ర్భాంతి చెందాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విరుగం బాక్కం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంతోష్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. సంతోష్‌ ఎలా మరణించాడనే విషయమై పోలీసులు తల్లిదండ్రులు, సోదరుడిని విచారిస్తున్నారు.

Read more