షాకింగ్: ఆ దేశం ఏకంగా కరోనా అనే పదాన్నే నిషేధించింది!

ABN , First Publish Date - 2020-04-01T23:37:07+05:30 IST

అదేంటో గానీ కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో టుర్కెమినిస్థాన్ అనే దేశం సరికొత్త పంథాను ఎంచుకుంది. ఆ దేశంలో ప్రజలెవ్వరూ కరోనా పేరెత్త కొడదని ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసింది.

షాకింగ్: ఆ దేశం ఏకంగా కరోనా అనే పదాన్నే నిషేధించింది!

టుర్కెమినిస్థాన్: అదేంటో గానీ కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో టుర్కెమినిస్థాన్ అనే దేశం ఎవ్వరూ కనీవినీ ఎరుగని పంథాను ఎంచుకుంది.  ప్రజలెవ్వరూ కరోనా పేరెత్తకూడదని అక్కడి ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసింది. అంతే కాకుండా ఈ నిబంధనను ఉల్లఘించేవారి భరతం పట్టేందుకు పోలీసులకు ప్రత్యేక అధికారాలను కట్టపెట్టింది. ఈ పదాన్ని ఉచ్ఛరించిన వారిని జైల్లో వేస్తామని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం ఈ చర్యలు సరిపోవనుకుందో ఏమో కానీ.. ప్రజలపై నిఘా ఉంచేందుకు ఏకంగా గూఢచారులను కూడా రంగంలోకి దింపింది. వీరు ప్రజల్లో కలిసిపోయి..కరోనా పేరును పలికే వారి భరతం పడతారట.


సమస్యల్లో పడకూడదనుకున్న వారు.. ఈ వైరస్ పేరుకు ప్రత్యామ్నాయ పదాలను వెత్తుక్కోవాలని సూచించింది. కాగా.. టుర్కెమినిస్థాన్‌లో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అక్కడి ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కానీ యూరప్ దేశాలు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. టుర్కెమినిస్థాన్‌పై అక్కడి ప్రభుత్వానికి గట్టి పట్టు ఉండటంతో దేశంలో ఏం జరుగుతోందో బయట ప్రపంచానికి తెలియడం కష్టం అని అనేక మంది భావిస్తుంటారు. 


Updated Date - 2020-04-01T23:37:07+05:30 IST