కశ్మీర్‌పై టర్కీ కుట్ర!
ABN , First Publish Date - 2020-12-05T07:45:59+05:30 IST
కశ్మీర్‌పై టర్కీ కుట్ర! (ఎస్‌ఎంవో)కు చెందిన సులేమాన్ షా బ్రిగేడ్ (టర్కీ) కిరాయి సైనికులను కశ్మీర్‌కు పంపాలని ప్రణాళికలు రూపొందించాడు. ఈ కుట్రను గ్రీక్ దేశానికి చెందిన ఆండ్రీస్ మౌంట్‌జోరాలియాస్ అనే జర్నలిస్టు బట్టబయలు చేశారు. ఇప్పటికే దక్షిణాసియాలోని ముస్లింల తరఫున పోరాటానికి టర్కీ సిద్ధమైనట్లు...
- సిరియాలోని కిరాయి సైనికుల తరలింపు
- కుట్రను బయటపెట్టిన గ్రీకు జర్నలిస్టు
న్యూఢిల్లీ, డిసెంబరు 4: కశ్మీర్‌పై టర్కీ కుట్ర! (ఎస్‌ఎంవో)కు చెందిన సులేమాన్ షా బ్రిగేడ్ (టర్కీ) కిరాయి సైనికులను కశ్మీర్‌కు పంపాలని ప్రణాళికలు రూపొందించాడు. ఈ కుట్రను గ్రీక్ దేశానికి చెందిన ఆండ్రీస్ మౌంట్‌జోరాలియాస్ అనే జర్నలిస్టు బట్టబయలు చేశారు. ఇప్పటికే దక్షిణాసియాలోని ముస్లింల తరఫున పోరాటానికి టర్కీ సిద్ధమైనట్లు ‘కశ్మీర్‌కు కిరాయి సైనికులను పంపుతున్న ఎరోడగాన్’ అనే ఆంగ్ల శీర్షికతో ప్రచురితమైన కథనంలో పేర్కొన్నారు. పాకిసా ్థన్, బంగ్లాదేశ్‌లు కూడా టర్కీ అధ్యక్షుడి వ్యూహానికి వత్తాసు పలుకుతున్నాయని వెల్లడించారు. సులేమాన్ షా బ్రిగేడ్ చీఫ్ అబూ ఎస్మా వ్యాఖ్యలను కథనంలో ప్రస్తావించారు. ‘‘ఈ కిరా యి సైన్యానికి మేం 2 వేల డాలర్ల జీతం ఇవ్వాలని నిర్ణయిం చాం. టర్కీ సర్కారు అభిమతం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. కశ్మీర్‌పై టర్కీ పట్టు సాధించడమే ధ్యేయం’’ అని ఇటీవల వ్యాఖ్యానించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే.. ఢిల్లీలోని టర్కీ రాయబారి ఓజ్కాన్ టోరున్లార్ ఈ కథనాన్ని ఖండించారు.