కరోనాను ఎదుర్కోవడానికి న్యూ ఇయర్ సందర్భంగా 4 రోజుల కర్ఫ్యూ

ABN , First Publish Date - 2020-12-15T11:23:10+05:30 IST

కరోనాను ఎదుర్కోవడానికి టర్కీ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ సంచలన ప్రకటన చేశారు....

కరోనాను ఎదుర్కోవడానికి న్యూ ఇయర్ సందర్భంగా 4 రోజుల కర్ఫ్యూ

టర్కీ అధ్యక్షుడి సంచలన ప్రకటన

అంకారా(టర్కీ): కరోనాను ఎదుర్కోవడానికి టర్కీ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ సంచలన ప్రకటన చేశారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా 4 రోజుల పాటు దేశంలో కర్ఫ్యూను విధిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా కరోనా ప్రబలకుండా నివారించేందుకు ముందు జాగ్రత్తగా డిసెంబరు 31వతేదీ రాత్రి 9 గంటల నుంచి జనవరి 4వతేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు దేశంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు తయ్యిప్ ఎర్డోగన్ చెప్పారు. ప్రభుత్వ సమావేశంలో దేశంలో కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించామని అధ్యక్షుడు వివరించారు.


 టర్కీ దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు కరోనా కట్టడికి కఠినచర్యలు తీసుకున్నారు. కరోనా ప్రబలకుండా స్విమ్మింగ్ పూల్సు, జిమ్ లను మూసివేశారు. షాపింగ్ కేంద్రాల్లోకి పరిమిత సంఖ్యలో సందర్శకులను అనుమతిస్తున్నారు.దేశంలో రెస్టారెంట్లు, కేఫ్ లను మూసివేసి, పార్శిల్ సర్వీసులను మాత్రమే అనుమతించారు. టర్కీ దేశంలో రెండోవిడత కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధించడంతోపాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2020-12-15T11:23:10+05:30 IST